కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

మనోరంజని ప్రతినిధి నిర్మల్:

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పక్కదారి పడుతున్నారని ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ మండిపడ్డారు.

ఆదివారం ఆయన మాట్లాడుతూ –

42% రిజర్వేషన్లు, మైనారిటీలకు 10% రిజర్వేషన్లు, ఓటు చోరీ వంటి అంశాలపై బండి సంజయ్ చేస్తున్న ప్రచారం అంతా తప్పుడు దేనని ఆయన స్పష్టం చేశారు. “ఓటు చోరీ అవుతోందని అనడం అంటే ప్రజలందరినీ అవమానపరచడమే” అని వ్యాఖ్యానించారు.

దేవుళ్లపై వ్యాఖ్యలు చేశారని తప్పుడు ప్రచారం చేయడం, సమాధానం చెప్పలేక పక్కదారి పడటం బండి సంజయ్‌కు వెన్నతో పెట్టిన విద్య” అని గోవింద్ నాయక్ తీవ్రంగా విమర్శించారు.

ఒక బీసీ నాయకుడు 45 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కష్టపడి కాంగ్రెస్‌లో పనిచేసి రాష్ట్ర అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్‌పై “బిచ్చగాళ్ల పార్టీ” అని సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

“దిష్టిబొమ్మలు, ప్లెక్సీలు కాల్చడం–తొక్కడం మేము మొదలుపెడితే మీరు తట్టుకోలేరు” అని హెచ్చరించిన గోవింద నాయక్, ఇప్పటికైనా బండి సంజయ్ 42% రిజర్వేషన్, ఓటు చోరీ అనే అంశాలపై ప్రజలకు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment