మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దం.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఆగస్టు 27
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్ధం అని అడెల్లి ఆలయ చైర్మన్ సింగం భోజా గౌడ్ అన్నారు. బుదవారం మండలము, అడెల్లి శ్రీ మహా పోచమ్మ దేవాలయము నందు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా భక్తులకు ఉచిత మట్టి విగ్రహలను పంపిణీ చేశారు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా పండగను నిర్వహించుకోని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ రాజేష్, ఆలయ అర్చకులు శ్రీవాస్ శర్మ,సిబ్బంది భక్తులు
గ్రామస్తులు పాల్గొన్నారు.