నాయాగం గ్రామంలో వసంతరావు చౌహన్ విగ్రహ ప్రతిష్టాపన
నాందేడ్ (మహారాష్ట్ర), ఆగస్టు 26 (M4News):
మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా నాయాగం గ్రామంలో స్వర్గీయ వసంతరావు చౌహన్ గారి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ పాల్గొని నివాళులర్పించారు.
అలాగే ఈ వేడుకలో చత్రపతి శివాజీ మహారాజ్ మునిమనుమడు, కొల్హాపూర్ ఎంపీ చత్రపతి షాహూజి మహారాజ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహన్, మహారాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వసంతరావు చౌహన్ గారి సేవలను స్మరించుకున్నారు.