ముంబైలో అత్యంత ధనిక వినాయకుడు

ముంబైలో అత్యంత ధనిక వినాయకుడు

ముంబైలో అత్యంత ధనిక వినాయకుడు

267 కేజీల బంగారు ఆభరణాలు, 350 కేజీల వెండి సింహాసనంతో గణపతి విగ్రహం అలంకరణ

ముంబైలో గణేశ్‌ చతుర్థి వేడుకల సందడి ప్రారంభమైంది. నగరంలోని ప్రముఖ మాతుంగా గణపతి (GSB గణపతి) దేశంలోనే అత్యంత ధనిక వినాయకుడిగా మరోసారి గుర్తింపు పొందాడు.

70 ఏళ్లుగా గౌడ సారస్వత బ్రాహ్మణ (GSB) ట్రస్ట్ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తోందని నిర్వాహకులు తెలిపారు.

గణపతి విగ్రహానికి అత్యంత భారీగా రూ.444 కోట్ల బీమా తీసుకున్నారు. ఇందులో విగ్రహం, బంగారం, వెండి ఆభరణాలు, మండపం వద్ద జరిగే అన్ని కార్యక్రమాలకు సంబంధించిన భద్రతా కవర్లు ఉన్నాయి.

భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు గణపతిని దర్శించుకుని, అన్నదానం సేవలో పాల్గొంటున్నారు.

మాతుంగా గణపతి ప్రత్యేకత ఏమిటంటే….ఏటా దశాబ్దాలుగా బంగారం, వెండి విరాళాలు పెరుగుతూనే ఉండటంతో ఈ గణపతి దేశంలోనే అత్యంత ధనికుడిగా నిలుస్తున్నాడు…

Join WhatsApp

Join Now

Leave a Comment