సేవ చేసిన వారిని ప్రజలు మర్చిపోరు

సేవ చేసిన వారిని ప్రజలు మర్చిపోరు

సేవ చేసిన వారిని ప్రజలు మర్చిపోరు

స్వర్గీయ మాజీ మంత్రి గడ్డెన్న సేవలను గుర్తు చేసిన ఎమ్మెల్యే పటేల్

ముధోల్ మనోరంజిని ప్రతినిధి ఆగస్టు 26

సహాయం చేసిన చేతులను ప్రజలు ఎల్లవెళ్లాలా గుర్తించుకుంటారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. ముధోల్ మండలంలోని సరస్వతి నగర్ లో అన్నబహు సాఠె జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాజీ దివంగత మంత్రి గడ్డె న్న సేవలను స్మరించుకున్నారు. సరస్వతి నగర్ ఏర్పాట అవడానికి కారణం ఆయనేని గుర్తు చేశారు. ఆకలేస్తే అన్నం పెట్టే వారిని, దాహం వేస్తే దప్పిక తీర్చే వారిని ప్రజలు గుర్తించుకుంటారన్నారు. అలాగే 32 సంవత్సరాల పాటు నియోజకవర్గాన్ని పాలించి ఆయన చేసిన కొన్ని మంచి పనులను ఎప్పటికీ మర్చిపోరన్నారు. ఆయన బాటలో సరస్వతి నగర్ అభివృద్ధికి పాటుపడతానన్నారు. 28 ప్యాకేజ్ పూర్తయితే తానుర్, ముధోల్ మండలాలకు సాగునీరు అందుతుందని ఆ ప్యాకేజీ పూర్తయ్యేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు. ప్రజలు తనకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారని వారికి సేవ చేయడమే తన సంకల్పం అన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment