స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి.
చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి. ఆగస్టు 27.
భీమారం మండలంలో మంగళవారం ముఖ్య నాయకుల తో ఏర్పాటుచేసిన సమావేశంలో చెన్నూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజారమేష్ lపాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజారమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాల్క సుమన్ ఆదేశానుసారం పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలియజేశారు.నియోజకవర్గ ప్రజలందరికీ మరియు అక్రమ కేసులకు గురవుతున్న నాయకులకు,కార్యకర్తలకు బాల్క సుమన్ మరియు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో భీమారం మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్, మాజీ ఎంపీటీసీ అత్కూరి రాము, మాజీ ఎంపీపీ సమ్మయ్య, మాజీ ఏఎంసి డైరెక్టర్ రాజ్ కుమార్ ,మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు