పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి ముధోల్ సిఐ జి. మల్లేష్

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

ముధోల్ సిఐ జి. మల్లేష్

ముదోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 25

పండుగలను ప్రజలు సోదర భావంతో కలిసిమెలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని ముధోల్ సిఐ జి. మల్లేష్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్ లోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగులను హిందు,ముస్లిం సోదరులు సోదర భావంతో జరుపుకోవాలని సూచించారు. గణనాథుడు నిమ్మజనం ప్రశాంతంగా సాగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై బిట్ల పెర్సిస్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు రోళ్ల రమేష్, బి డి సి అధ్యక్షులు విట్టల్, వెంకటేష్,మాజీ వైస్ ఎంపీపీ ఎజాజ్ ఉద్దీన్,మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, మాక్ధూమ్, మాజీ సర్పంచ్ అనిల్, మాజీ ఉప సర్పంచ్ మోహన్ యాదవ్,నాయకులు కిషన్ పటేల్, ఖాలీద్ పటేల్, రావుల గంగారెడ్డి, కోరి పోతన్న, కిషన్ పాతంగే,జీవన్, అజిజ్,ప్రజా ప్రతినిధులు గణేష్ మండపం నిర్వహకులు, హిందు ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, తదితరులు, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment