గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలి..ముధోల్ సిఐ మల్లేష్.

గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలి..ముధోల్ సిఐ మల్లేష్.

గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలి..ముధోల్ సిఐ మల్లేష్.

మనోరంజని ప్రతినిధి తానూర్:: ఆగస్టు 22

నిర్మల్ జిల్లా తానుర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో జరగబోయే గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, నిర్వహించుకోవాలని ముధోల్ సిఐ మల్లేష్ అన్నారు.
శుక్రవారం ఎమ్మెస్సార్ ఫంక్షన్ హాల్ గణేష్ నిర్వాహక కమిటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు,ఉత్సవాల నిర్వహణ పై హిందూ,ముస్లిం ప్రతినిధుల,అభిప్రాయాలు, సూచనలు అయన స్వీకరించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ,గణేష్ ఉత్సవాలు ప్రతి ఒక్కరు స్నేహపూర్వకంగా జరుపుకోవాలని,నిమజ్జనం సహా అన్ని కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో ముగియాలని, తమ గణేష్ మండలిల వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఉత్సవాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలందరూ పోలీసులకు సకరించాలని అయన అన్నారు.ఈ సమావేశంలో ఎంపీడీఓ నసురుద్దీన్,తాసిల్దార్ మహేందర్ నాథ్, ప్రత్యేక అధికారి శ్రీనివాస్,ఎస్ఐ షేక్ జుబేర్,హనుమాన్లు, ఐకేపి ఏపిఎం సులోచన రెడ్డి, ఏఎస్ఐ నర్సింగ్ భాను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మౌలా ఖాన్,పోలీస్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment