టచ్ హాస్పిటల్‌కి అంతర్జాతీయ గౌరవం – డాక్టర్ రాజేష్ బుర్కుండే ఎంపిక.
మంచిర్యాల మనోరంజని ప్రతినిధి, ఆగస్టు 22.
మంచిర్యాల్ జిల్లా టచ్ హాస్పిటల్ లో పనిచేస్తున్న ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ రాజేష్ బుర్కుండే, మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో మే 4–5, 2026 తేదీలలో జరగనున్న 4వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కార్డియాలజీ అండ్ కార్డియోవాస్క్యులర్ రీసెర్చ్ లో స్పీకర్‌గా ఎంపికయ్యారు.
ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు, పరిశోధకులు పాల్గొనబోతున్నారు. భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్న డాక్టర్ రాజేష్, కార్డియాలజీ రంగంలో తన అనుభవం, పరిశోధనలపై ముఖ్యమైన ప్రసంగం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా టచ్ హాస్పిటల్ ,మంచిర్యాల్ లోని డాక్టర్లు ఇప్పటివరకు అనేక క్లిష్టమైన ప్రొసీజర్స్ విజయవంతంగా పూర్తి చేసి అనేకమంది ప్రాణాలను రక్షించారు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న అత్యాధునిక అడ్వాన్స్డ్ క్యాత్ లాబ్ ద్వారా అనేక హృదయ సంబంధిత అత్యవసర సేవలను విజయవంతంగా అందిస్తున్నామని అన్నారు. డాక్టర్ రాజేష్ బుర్కుండే ఈ ఎంపికతో పాటు, టచ్ హాస్పిటల్ అందిస్తున్న అద్భుతమైన సేవలకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించడం గర్వకారణం అని మేనేజ్మెంట్ తెలిపారు. ఈ సందర్భంగా
డాక్టర్ రాజేష్ బుర్కుండే మరియు టచ్ హాస్పిటల్ టీమ్‌కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.