కేటీఆర్ కీలక నిర్ణయం.. కవిత లేఖాస్త్రం
హైదరాబాద్, ఆగస్టు 21: బీఆర్ఎస్ పార్టీలో అధిపత్యం కోసం జరుగుతున్న అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకొంది. ఇంకా చెప్పాలంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కుమారుడు కేటీఆర్‌కు కుమార్తె కల్వకుంట్ల కవిత మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుగా మారింది. అలాంటి వేళ.. కవిత ఎపిసోడ్‌పై బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కవితను ఆమె పదవి నుంచి సోదరుడు కేటీఆర్ తొలగించారు. కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో ఆమెరికా పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత స్పందించారు.
ఆ క్రమంలో సింగరేణి కార్మికులకు కవిత గురువారం ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తన సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్ లక్ష్యంగా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీలో తాజాగా ఇటీవల చోటుచేసున్న పరిణామాలపై కె. కవిత తీవ్ర ఆందోళన చెందారు. బీఆర్ఎస్ పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని కవిత మరోసారి ఆరోపించారు.
తాను ప్రశ్నించినందునే పార్టీలో తనపై కొందరు కక్ష కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ హితం కోరి తాను మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీలోని నేతలు తన పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి కేసీఆర్‌కు తాను రాసిన లేఖ తర్వాత తనను వేధింపులకు గురిచేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను అమెరికా పర్యటనలో ఉండగా.. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తనను టీబీజీకేఎష్ నుంచి తొలగించారని ఆ లేఖలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
విదేశీ పర్యటనలో కవిత..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆమె చిన్న కుమారుడు ఆర్యకు అమెరికా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. దీంతో అతడిని యూనివర్సిటీలో జాయిన్ చేసేందు ఆర్యతో కలిసి ఆమె అమెరికాకు వెళ్లారు. ఈ పర్యటనకు వెళ్లే ముందు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను తన కుటుంబంతో కలిసి కవిత కలిశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో తండ్రి కేసీఆర్ నుంచి కల్వకుంట్ల కవిత కుటుంబం ఆశీర్వాదం తీసుకుంది. ఆ వెంటనే కవిత కుటుంబం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆ మరునాడే తన కుమారుడితో కలిసి.. కవిత అమెరికాకు పయనమైయ్యారు. ఆమె విదేశీ పర్యటనలో ఉండగా.. సింగరేణి సంస్థలకు చెందిన పదవిని కొప్పుల ఈశ్వర్‌కు కేటీఆర్ కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులను ఉద్దేశిస్తూ.. కల్వకుంట్ల కవిత అమెరికా నుంచి లేఖ రాశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో అన్నచెల్లమ్మల మధ్య పోరు తార స్థాయికి చేరిందనే వార్తలు వెలువడుతున్నాయి.