పండుగాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
ఆడిషినల్ ఎస్పీ అవినాష్ కుమార్
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 20
ప్రతి ఒక్కరు కలిసి మెలసి ఉంటూ అన్ని మతాలకు చెందిన ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకుంటు మత సామరస్యా నికి ప్రతీకగా నిలవాలని బైంసా ఎడిషినల్ ఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్ లోని జీ ఏం పంక్షన్ హాల్ లో బుధువారం నిర్వహించిన శాంతి కమిటి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి మండపాల్లో నిర్వాహకులు పోలీసులు నిర్ణయించిన నియమాలను కచ్చితంగా పాటించాలని కోరారు. గణేష్ మండపాల నిర్వాహకులు నిమజ్జనం రోజు ఏలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలన్నారు. పరిమితికి మించి డీజె సౌండ్లను పెట్టుకోవద్దని ఎలాంటి గొడవలకు తావులే కుండా శోభయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. పోలీసులు గణేష్ మండపాల నిర్వాహకులకు అందుబాటు లో ఉంటామని అన్నారు. ఈ కార్యక్ర మంలో తాసిల్దార్ శ్రీ లత, సిఐ మల్లేష్,ఎస్సై బిట్ల పెర్సిస్, సీనియర్ అసిస్టెంట్ నజీమ్ గ్రామపంచాయతీ ఈవో అన్వర్ అలీ, లైన్ మెన్,ఉత్సవ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రోళ్ల రమేష్,ధర్మపురి సుదర్శన్,మాజీ సర్పంచ్ అనిల్, వీడిసి అధ్యక్షులు విట్టల్, దశరథ్, నాయకులు కోరి పోతన్న, దేవోజీ భూమేష్, తాటేవార్ రమేష్, గడ్డం సుభాష్, మెత్రి సాయినాథ్, జాంబుల సాయిప్రసాద్, బాలాజీ, లవన్ భాస్కర్, సంతోష్ ఉత్సవ క మిటీ సభ్యులు, గణపతి మండపాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు