శీర్షిక శ్రీ కృష్ణాష్టమి
క్రిష్ణాష్టమి వేడుకలకు రారా కృష్ణయ్య
మా శ్వాసకు శ్రుతి నీవే రారా కృష్ణయ్య
నీ పాద స్పర్శతో పునీతమయ్యె యమున అమ్మ
నీ పాద స్పర్శతో ధన్యత చెందె పుడమి అమ్మ
నీ చిన్ని పాదాల చిరుగజ్జెల సవ్వడితో
మా మదిన కోటి కాంతులు వెలిగించినావు
నీ ముద్దు లొలుకు అడుగులతో మాఇంటిని
పావనం చేసినావు
నీ వేణుగానంతో మమతను పంచిననావు
చిలిపి కృష్ణ
మా మనసే వెన్నగా మార్చాము
ఆరగించి మమ్ము ముక్తి నీయుము చిలిపి కృష్ణ
అలుక మానరా అల్లరి కృష్ణయ్య
మా భక్తిభావపు సాక్ష్యమై కదలి రారా కృష్ణయ్య
ఈ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు చింతలన్నింటినీ దోచుకుని, మీకు ప్రేమ, ఆనందం, శాంతి, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ
రచన మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218