గిరిజన బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం

గిరిజన బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం

గిరిజన బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం

లింగాపూర్ మండల వాసి డాక్టర్ ఆడే బాబు నాయిక్ గారికి సాహిత్య రంగంలో రాష్ట్రస్థాయి అవార్డు.

లింగాపూర్ మండలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్.వి.ఎస్.ఎస్.సి డిగ్రీ కళాశాల సూళ్లూరుపేట లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆడే బాబు నాయిక్ గారికి వీణా వాదిని సేవా మంచ్ ఫిరోజాబాద్ (ఉత్తర ప్రదేశ్) మరియు బృజలోక సాహిత్య కళా సంస్కృతి అకాడమీ వారు సంయుక్తంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్మృతి సమ్మాన్ రాష్ట్రీయ అవార్డు ప్రదానం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును 15 ఆగస్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ ఎల్ బి శంకర్ శర్మ  ప్రధానం చేశారు. ప్రిన్సిపాల్  మాట్లాడుతూ…. సాహిత్య రంగంలో విశిష్ట కృషి చేసినందుకు వీణా వాదిని సేవ మంచ్ మరియు బృజలోక్ సాహిత్య కళా సంస్కృతి అకాడమీ వారు రాష్ట్రస్థాయి సాహిత్య అవార్డును డాక్టర్ బాబు నాయిక్ గారికి ప్రధానం చేశారని తెలియజేశారు. ఆడే బాబు నాయిక్ రచనలను మరియు కృషిని ప్రిన్సిపాల్ గారు మరియు సహ అద్యాపకులు అభినందించారు. వివిధ విషయంలో మొత్తం 22 పరిశోధన వ్యాసాలు రాశారన్నారు. వీరు హిందీ సాహిత్యానికి చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ బాబు నాయిక్ మాట్లాడుతూ…. ఈ గౌరవం నాకు సాహిత్య సృష్టిపట్ల మరింత నిబద్దతను, ప్రేరణను, అందించింది అని అభిప్రాయం పడ్డారు. ఈ శుభ సందర్భం లింగాపూర్ మండల వాసులకు ఎంతో గర్వకారణమని పలువురు పెద్దలు ప్రశంసించారు

Join WhatsApp

Join Now

Leave a Comment