రజనీకాంత్ ‘కూలీ’ సినిమా టికెట్ రేట్ల పెంపు
హీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘కూలీ’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 100 రూపాయలు అదనంగా పెంచుకోవడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14 నుంచి 23 వరకు టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చింది. దీంతోపాటు కూలీ సినిమా అదనపు షోలకు అనుమతిచ్చింది. ఈ మేరకు 14న ఉదయం కూలీ చిత్రం బెనిఫిట్ షో వేయనున్నారు.