బంజారా భాషను 8వ షెడ్యుల్ లో చేర్చాలి
◆మోహన్ నాయక్
ఢిల్లీలో ఎంపీ పోరికా బలరాం నాయక్ ని కలిసిన గిరిజన సంఘాల నాయకులు
మనోరంజని ప్రతినిధి,న్యూఢిల్లీ, ఆగస్టు 04:
ఢిల్లీలో బంజారా భాష(గోర్ బొలి)ని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ పార్లమెంట్లో మాట్లాడాలని మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు పోరికా బలరాం నాయక్ ని కలిసిన గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్ చౌహన్. గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్పతి నాయక్. బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్. విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. శ్రీకాంత్ నాయక్ గిరిజన సంఘం నల్గొండ గిరిజన సంఘం నల్గొండ ఉపాధ్యక్షులు మోహన్ పవర్. కలిసి వినతి పత్రం ఇచ్చి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులను అలాగే కేంద్ర మంత్రులను కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ బంజారా భాష ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని బంజారా భాష భారత దేశంలో సుమారు 16 కోట్ల మంది మాట్లాడేటువంటి ఒక గొప్ప భాషా అని సుమారు 20 రాష్ట్రాలలో గుర్తింపు ఉండి ప్రాచుర్యంలో ఉన్నటువంటి భాషను నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో బంజారా భాష గోర్బోలి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేసారు. బంజారా భాష గురించి అవసరమా అనుకుంటే దేశవ్యాప్తంగా మహా పాదయాత్ర అని చేపడతామని భారతదేశంలోని బంజారాలందరినీ ఏకం చేసి ఒక ఐక్యత సభను ఢిల్లీ కేంద్రంగా కూడా జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. బిజెపి పార్టీ నాయకులకు అలాగే అధికారంలో ఉన్నటువంటి నాయకులకు మా భాషను విస్మరిస్తే రాబోయే కాలంలో బంజారా జాతి తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని బంజారా భాష బంజారాల అస్తిత్వానికి ప్రతి కాని సంత్ సేవలల్ మహారాజ్,హాతిరాం బావాజీ జాటో తను నాయక్ లక్కీషా బంజారా లాంటి వీరులు మాట్లాడిన భాషను ఈరోజు పట్టించుకోకుండా వదిలేయడం అనేది భారతదేశంలో బంజారా అవమానపరచడమే అని ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.గ్రామపంచాయతీ తండాల నుండి జాతీయస్థాయి వరకు ఈ పోరాటం ముందుకు తీసుకెళ్తామని ఇప్పటికీ తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీలో గుర్తించకుండా తండా ఆస్తిత్వమే ప్రమాదంలో ఉన్నది రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అలాగే గిరిజన తెగల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని మరి కొంతమంది నాయకులు చూస్తున్నారని ఇటువంటివి సహించేది లేదు అని ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా గిరిజన సంఘాల నాయకులు వారి యొక్క కార్యచరణ ప్రకటించి మరో నాలుగు రోజులపాటు ఢిల్లీలో ఉండి అందరిని కలిసి బంజారా జాతి సమస్యలను జాతీయస్థాయిలో మీడియా ముందు ఉంచి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు