సిరాల ప్రాజెక్ట్ ప్రధాన కాలువలు బాగుచేయించండి
ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడం పట్ల హర్షం
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ను సన్మానించిన గ్రామస్తులు
బైంసా రూరల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 4
సిరాల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయించినందుకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ను దేగాం గ్రామస్తులు సన్మానించారు. గతం లో సిరాల ప్రాజెక్ట్ ద్వారా మా పొలాలకు సాగు నీరు అందేదని ప్రస్తుతం ప్రధాన కాలువ బాగు చేయిస్తే తమకు సాగు నీరు అందుతుందని రైతులు తెలియజేశారు.ప్రాజెక్ట్ పూర్తి కావడం సంతోషకరమని, కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తే తమకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి ఎస్టిమేట్ తయారు చేయించి, సమస్యను ప్రభుత్వానికి విన్నవించినట్లు చెప్పారు. సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా వనరులున్నప్పటికీ రైతాంగానికి సాగునీటి ఫలాలు అందలేదన్నారు. అనంతరం గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించారు. దశలవారీగా సమస్యల పరిష్కారానికి పాటుపడతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు.