తెలంగాణకు బుల్లెట్ ట్రైన్
తెలంగాణకు బుల్లెట్ రైలు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీకి ప్రతిపాదనలు సమర్పించారు.ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు మార్గం ఉండేలా ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు జరుగుతున్నాయి.