ఏజెన్సీ గిరిజన ఉపాధ్యాయులకు కాదని వేరే వర్గాల ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకండి.వెంటనే ఏజెన్సీ లో పదోన్నతులు ఆపండి:- చవాన్ నరేష్ ,టిజి.టిటిఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి.

ఏజెన్సీ గిరిజన ఉపాధ్యాయులకు కాదని వేరే వర్గాల ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకండి.వెంటనే ఏజెన్సీ లో పదోన్నతులు ఆపండి:- చవాన్ నరేష్ ,టిజి.టిటిఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి.

ఏజెన్సీ గిరిజన ఉపాధ్యాయులకు కాదని వేరే వర్గాల ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకండి.వెంటనే ఏజెన్సీ లో పదోన్నతులు ఆపండి:- చవాన్ నరేష్ ,టిజి.టిటిఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి.

ఈ రోజు ది:04.08.2025 న టిజి.టిటిఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చవాన్ నరేష్ అద్వర్యం లో, జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారిని కలిసి ఉపాద్యాయ పదోన్నతుల విషయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది.

*ఈ కార్యక్రమానికి చవాన్ నరేష్ ,టిజిటిటిఎఫ్ (తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్) జిల్లా ప్రధానకార్యదర్శి చవాన్ నరేష్ హాజరై మాట్లాడుతూ
భారత రాజ్యాంగం 5,6 వ షెడ్యూల్,X పార్ట్,ఆర్టికల్ 244,244(1),పెసా యాక్ట్ ,1/70 యాక్ట్ కి లోబడి షెడ్యూల్ ఏరియాలో ఉద్యోగాలు,రాజకీయ పదవులు,భూమి మీద హక్కు, టెండర్లు,చైర్మన్ పదవులన్నీ దక్కుతున్నాయని చెప్పారు.ఏజెన్సీ చట్టాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ గిరిజనులకు అన్నిరంగాల్లో రిజర్వేషన్ ఇవ్వడం ,సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు.

ఆర్టికల్ 14,15,16,ఇంద్రసాహాని కేసుతో ఏజెన్సీ ప్రాంత చట్టాలకు ఎటువంటి సంబంధం లేదు.కానీ సుప్రీమ్ కోర్టు ఏజెన్సీ చట్టాలను పరిగణనలో తీసుకోకుండా ఆర్టికల్ 14,15,16 ,ఇంద్ర సహాని కేసును పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా ఇచ్చిన జిఓ జిఓ3 కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి గిరిజన జీవితాల్లో చీకటి నింపిందన్నారు.

యావత్ ఏజెన్సీ గిరిజన సమాజం ఈ తీర్పును తప్పుబడుతున్నారని,జి ఓ 3 పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో అనేక లోపాలు ఉన్నాయని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పీల్స్ చేసి ఉన్నారని,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున: సమీక్షించి ఏజెన్సీ జిల్లాలో 70% నుండి 80% వరకు ఉన్న గిరిజన జనాభాను పరిగణనలోకి తీసుకొని గిరిజన హక్కులను కాపాడాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ హక్కుల మీద తుది నిర్ణయం తీసుకునే వరకు ఏజెన్సీ గిరిజన ఉపాధ్యాయులను కాదని వేరే వర్గాలకు ఉద్యోగ నియామకాలు గాని, పదోన్నతులు గానీ ఇవ్వరాదని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

ఈ క్రింది ప్రధాన డిమాండ్స్ లతో కూడిన మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

1)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చే వరకు ఏజెన్సీ ప్రాంతంలో వేరే వర్గాల ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకూడదు. పదోన్నతులను వెంటనే ఆపాలి.

2)SC/ST ఉపాధ్యాయ పదోన్నతుల విషయంలో ఎడక్వసీ అనేది ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి ఎవరి వాటా వారికి ఇవ్వగలరు.
మీ వాటా ఇచ్చేశామని చెప్పడం వలన తీరని అన్యాయం జరుగుతుంది.
రిజర్వేషన్ రోస్టర్ లో కాకుండా మెరిట్ లో అర్హత సాధించి మెరిట్ రోస్టర్ లో ఉపాధ్యాయ నియామకాలు పొందిన SC/ST ఉపాధ్యాయుల మెరిట్ రోస్టర్ లో ఎవరిని కూర్చోబెట్టారో తెలుపగలరు.
ఉదాహరణకి 100 పోస్టుల్లో 25 మంది ST అభ్యర్థులు నియామకాలు తీసుకొని ఉంటే కేవలం 10 మందికి మాత్రమే పదోన్నతి లభిస్తుంది.
మిగిలిన 15 మంది రోస్టర్లో ఎవరిని కూర్చోబెట్టారో తెలపగలరు.

గతంలో జనరల్ కోటా లేదా ఏజెన్సీ కోటాలో పదోన్నతులు పొందిన ST టీచర్స్ లను కూడా ఎడక్వసీ కింద చూపించడం వలన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియామకం పొందిన ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతుంది.

3) డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఉన్న ఖాళీలలో ఎడక్వసీ ప్రకారం ఎవరి వాటా వారికి ఇస్తున్నట్లుగా ప్రమోషన్ రిక్రూట్మెంట్ లో కూడా ఉన్న ఖాళీల నుండి ఎవరి వాటా వారికి ఇవ్వండి.

4)NCRT నార్మ్స్ ఆధారంగా సుప్రీం కోర్టు తీర్పు కు అనుగుణంగా TET క్వాలిఫై అయిన ఉపాద్యాయులకు పదోన్నతులు కల్పించాలి.

ఈ కార్యక్రమం లో రాథోడ్ దినేష్, ప్రమేశ్వర్, రాజేష్, సరస్వతి, పద్మ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment