✒ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన సోనూసూద్
* ఫిష్ వెంకట్ (Fish Venkat) కుటుంబాన్ని బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu Sood) సోమవారం పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వెంకట్ మరణం తనను కలచివేసిందన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వెంకట్ కొన్ని రోజుల క్రితం మరణించారు. వెంటనే స్పందించిన సోనూసూద్ తన వంతుగా వెంకట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి, ధైర్యాన్నిచ్చారు