ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
భీమారం మండల కేంద్రంలో
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేసి
సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి.మధు జాతీయ కార్యదర్శి కొంకటి.లక్ష్మణ్, ల చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నెరువట్ల,రాజలింగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో,జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు.భీమారం మండల ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ
అధ్యక్షులుగా మంతెన. సమ్మయ్య,
ఉపాధ్యక్షులుగా ఆవిడపు. సురేష్,
ఉపాధ్యక్షులుగ గాలిపెల్లి. నాగభూషణ్,
ప్రధాన కార్యదర్శి గా దుర్గం. తిరుపతి,
ప్రచార కార్యదర్శి గా కుమ్రే. సాగర్,
సహాయ కార్యదర్శి గా దాసరి. నరేందర్,
కోశాధికారి గా పోతం. సమ్మయ్య,
ధరవత్. శంకర్ లు కార్యవర్గం సభ్యులుగా ఎన్నుకోబడ్డారు.
ఈ సందర్బంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షులు మంతెన సమ్మయ్య మాట్లాడుతు. జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకుల దిశా నిర్దేశంలో,ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం,మండలంలోని పలు గ్రామాలలో, పూర్తిస్థాయిలో,మండల కమిటీ సభ్యులము నిర్మాణం కోసం కృషి చేయడం జరుగుతుందని, అధ్యక్షులు గా బాధ్యతలు అప్పగించినందులకు ప్రతి ఒకరికి ప్రత్యేక జై భీమ్ లు తెలిజేస్తూ శిరస్సు వంచి ధన్యవాదములు చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం మంచిర్యాల జిల్లా కో కన్వీనర్లు, ఆసంపల్లి శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరి రవికుమార్, పానుగంటి. రాజలింగు సింగరేణి ఎస్ సి, ఎస్ ఎస్టీ ఏంప్లాయిస్, జాడి. నరేష్, మద్దెల. నరసింహులు జిల్లా నాయకులు,యువకులు, ఆటో,ట్రాలీడ్రైవర్ లు తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా నియమితులైన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, కమిటీకి, జాతీయ,రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది