వ్యవసాయ పథకాలపై రైతులకు అవగాహన కార్యక్రమం
మనోరంజని ప్రతినిధి నిర్మల్ అగస్టు 02
పెంబి మండలంలోని బావాపూర్, సింగపూర్, రాజుర గ్రామాల్లో బ్యాంకు అధికారులు శనివారం రైతులకు వ్యవసాయ సంబంధిత పథకాలపై అవగాహన కలిగేలా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించి పంట రుణాలకు సంబంధించి వివరాలన్నింటిని రైతులకు అర్థమయ్యేలా వివరించారు. ఖానాపూర్, పెంబి పరిసర ప్రాంతాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడేలా కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి సహకారం అందిస్తామని లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ తెలిపారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజరు నరసింహారెడ్డి, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు