పోచమ్మ దుకాణాల సముదాయనికి వేలం.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఆగస్టు 02 –
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలో ప్రసిద్ధి గాంచిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం వద్ద శనివారం వివిధ దుకాణాల సముదాయానికి బహిరంగ వేలం పాట నిర్వహించారు .తైబజార్ వసూలు చేసుకొనుటకు వేలం పాట లో రూ.4లక్షల 18వేలు,కొబ్బరి ముక్కలు ప్రోగు చేసుకొనె హక్కు రూ.43 వేలు,ఇడుపు పిల్లలు సేకరించు హక్కు రూ.81 వేలు,ఈ మూడు వేలముల ద్వారా రూ.5 లక్షల 42 వేలు ఆదాయం సమకూరింది మిగితా సముదాయలకు సరైన ఆదాయం రానందున వాయిధ వేసినట్లు ఆలయ చైర్మన్ సింగం భోజగౌడ్, ఈ.ఓ రమేష్ తెలిపారు. ఈ వేలం పాటకు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి రంగు రవి కిషన్ గౌడ్, పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వ్యాపారస్తులు, ఆలయ సీనియర్ అసిస్టెంట్ రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు