సారంగాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, అడెల్లి టెంపుల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక…..
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఆగస్టు 02
నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి అధ్యక్షుని క్యాంపు కార్యాలయం లో సారంగాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొత్త కాపు పోతారెడ్డి, ఢిల్లీ టెంపుల్ డైరెక్టర్ బట్టు భోజన్న ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం కౌట్ల బి గ్రామానికి చెందిన దేవుళ్ళ పోశెట్టి బిజెపి పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కూచడి శ్రీహరి రావు సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు దశల వారిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఆది, మార్కెట్ డైరెక్టర్ లు కొత్త కాపు పోత రెడ్డి, ముక్తార్, ముత్యం రెడ్డి,సూభాష్ రెడ్డి, సదా ప్రశాంత్ అడెల్లి టెంపుల్ డైరెక్టర్ బట్టు భోజన్న, సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియ కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్, మాజీ మార్కెట్ చైర్మన్ లు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తాజ మాజీ సర్పంచ్ లు, తాజ మాజీ ఎంపీటీసీ లు సారంగాపూర్ మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.