BREAKING: అకౌంట్లోకి రూ.7 వేలు జమ
BREAKING: అకౌంట్లోకి రూ.7 వేలు జమ
ఆంధ్రప్రదేశ్ : ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్లో రూ.7 వేలు జమ చేశారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం వాటాగా రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.831.51 కోట్లు, రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.2342.92 కోట్లు విడుదల చేశారు. అన్నదాత సుఖీభవతో ఏపీలోని 46.85 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.