✒అశ్వదళంలో తొలిసారిగా మహిళా కానిస్టేబుళ్లు
తెలంగాణ పోలీసు అశ్వదళంలో (మౌంటెడ్ పోలీస్-నగర విభాగం) తొలిసారిగా 10 మంది మహిళా కానిస్టేబుళ్లు చేరారు. ఈ దళం నెక్లెస్ రోడ్డు, అసెంబ్లీ, చార్మినార్ వద్ద విధులు నిర్వహిస్తోంది. పండగలు, ఉత్సవాల సమయాల్లో ఘర్షణలు జరగడానికి అవకాశమున్న ప్రాంతాల్లో గస్తీ చేపడుతోంది. ఇద్దరికి రోజు విడిచి రోజు లేక్ పోలీస్ డ్యూటీ ఉంటుంది. ప్రతి శుక్రవారం ఈ దళం పాతబస్తీలో ఉంటుంది