✒1247 మంది బాలలను రక్షించిన పోలీసులు
హైదరాబాద్లో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైందని డీసీపీ డా.పి.లావణ్య నాయక్ జాదవ్ తెలిపారు. బాల కార్మికులు, భిక్షాటనలో ఉన్న పిల్లలను గుర్తించేందుకు పోలీసులు, బాలల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖలు, ఎన్జీవోలతో కలిసి జులైలో తనిఖీలు నిర్వహించారు. వాణిజ్య సంస్థలు, ట్రాఫిక్ జంక్షన్లు, స్టేషన్లలో 1173 బాలురు, 74 బాలికలతో సహా 1247 మందిని రక్షించారు. 55 యజమానులపై, 939 కనీస వేతన చట్టం కేసులు నమోదయ్యాయి