Harish Rao | ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు.. పొక్కలు కొట్టేందుకు..! నారా లోకేశ్‌కు హరీశ్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్..!!
Harish Rao | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు..
పొక్కలు కొట్టేందుకు అని నారా లోకేశ్‌కు హరీశ్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
నిన్న నారా లోకేశ్ మాట్లాడుతూ.. మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.. కనబడుతలేదా అంటున్నాడు. సాగునీటి జలాల్లో నారా లోకేశ్‌కు అవగాహనం లోపం ఉంది. ఆయన యంగ్‌స్టర్.. భవిష్యత్‌ను చెడగొట్టుకుంటున్నారు. అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాసుపాలు అవుతున్నారు. అధికారం ఉంది కదా.. మందబలం ఉంది.. సీఎం రేవంత్, కేంద్రం మా చేతుల్లో ఉన్నారని ఏది మాట్లాడితే అది మాట్లాడితే చెల్లుతది అనుకుంటే అది పొరపాటు కదా..? మిగులు జలాలు సముంద్రంలో కలుస్తున్నాయి అంటున్నారు కదా.. ఒక వేళ నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డీపీఆర్‌ను ఎందుకు తిప్పి పంపింది. గోదావరి రివర్ మేనేజమెంట్ బోర్డు ఎందుకు తిప్పి పంపింది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా తిరస్కరించింది. నీళ్లు ఉన్నది నిజమైతే నాలుగు కేంద్ర సంస్థలు బనచర్లకు ఎందుకు తిరస్కరించాయో లోకేశ్ సమాధానం చెప్పాలి. గోదావరిలో తెలంగాణ వాటా ఎంత..? ఏపీ వాటా ఎంతో సమాధానం చెప్పాలని నారా లోకేశ్‌ను హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు పొక్క కొట్టి తీసుకుపోతున్నామా..? పొక్క కొట్టేందుకు ఇది ఏమైనా శ్రీశైలం ప్రాజెక్టా..? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా..? ఇది ఏమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశా..? కాళేశ్వరం ఒక లిఫ్ట్ ఇరిగేష్ ప్రాజెక్టు.. దీనికి పొక్క కొట్టుడు, చిల్లు కొట్టుడు ఉండదు. ఆనాడు ఉమ్మడి ఏపీలో ఈనాటి కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల మీరు ఆడిందే ఆట పాడిందే పాట.. పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి నీళ్లు తీసుకుపోయారు.. ఈనాటి కాంగ్రెస్ నాయకుల మౌనం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కానీ ఇక్కడున్నది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంగా ఉంది. ఇష్టమొచ్చినట్టు పొక్క కొడుతాం అంటే చూసుకుంటూ ఊరుకోం అని నారా లోకేశ్‌ను హరీశ్‌రావు హెచ్చరించారు.
నారా లోకేశ్ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి లేదని మాట్లాడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 11 అనుమతులు ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు సాధించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు అనుమానం ఉంటే ఈ అనుమతుల లేఖలు పంపిస్తాను వెరిఫై చేసుకోండి అని హరీశ్‌రావు సూచించారు.
నిన్న లోకేశ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడైనా అడ్డుకున్నామా..? టీడీపీ అడ్డుకొలేదు. తెలుగు ప్రజలంతా ఒక్కటే అని సన్నాయి నొక్కులు నొక్కతున్నాడు. మీకు తెల్వకపోతే మీ నాన్నను అడగండి.. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నామా..? లేకపోతే ఎన్నిసార్లు అడ్డుకున్నాం అని మీ నాన్నను అడగండి. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత 2018లో రద్దు చేయండి, పనులు నిలిపివేయండి అని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ బాబు ఏడు లేఖలు రాశారు. నిన్ననేమో మేం కాళేశ్వరం వ్యతిరేకించామా..? అని లోకేశ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు