✒సచివాలయంలో ప్లాస్టిక్ బాటిళ్లపై బ్యాన్!
రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సచివాలయం నుంచే ప్లాస్టిక్‌పై నిషేధం అమలు చేయనుంది. ఆగస్టు 10 నుంచి సెక్రటేరియట్‌లోకి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తీసుకురాకూడదని స్పష్టం చేసింది. ఉద్యోగులకు స్టీల్ బాటిల్స్ ఇస్తామంది. ఇప్పటికే పలు పట్టణాలు, నగరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై అమ్మకాలపై నిషేధం అమలవుతుండగా, త్వరలో రాష్ట్రమంతా విస్తరించే అవకాశముంది.