ఆలయ డైరెక్టర్ ఎన్ హెచ్ఆర్ సి ఆధ్వర్యంలో సత్కారం
నిజామాబాద్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు1*
నూతన ఆలయ డైరెక్టర్ గా నియామకం అయిన ప్రవీణ్ ను ఎన్ హెచ్ ఆర్ సి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఆ సంతోషిమాత, సాయిబాబా ఆశీస్సుల తో డైరెక్టర్ గా నియామకం అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీకి నన్ను గుర్తించి సన్మానం చేసిన మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర , ప్రధాన కార్యదర్శి మోదిన్పల్లి చంద్రశేఖర్, వారి టీం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అటు సాయిబాబా ఆలయానికి ఇటు మానవ హక్కుల కమిటీకి ఎలాంటి సహాయం అయినా నేను చేయడానికి ముందు ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర తో పాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కార్యదర్శి జే లక్ష్మణ్, ఎండి రఫీక్, ఉపాధ్యక్షులు నరేందర్, చండాలియా వెంకటేష్, సహ కార్యదర్శి చింతకింద సంతోష్, నగర జిల్లా అధ్యక్షురాలు పి. జ్యోతి, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు