మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి

మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

బైంసా మనోరంజని ప్రతినిధి ఆగస్టు1

మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి

మున్సిపాలిటీల అభివృద్ధికి నిరంతరం స్పష్టమైన ప్రణాళికతో కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కాల్యాలయంలో పారిశుద్ధ్యం, పన్నుల వసూలు, మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లు, పట్టణ సుందరీకరణ, తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాణిజ్య, వ్యాపార, ప్రకటనల, తదితర పన్నులు అన్నింటిని సకాలంలో వసూలు చేయాలన్నారు. వార్డుల్లో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. వర్షాకాలం కాలానుగుణ వ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. నీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పట్టణంలో కీలకమైన కూడళ్ళలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు అధికారులంతా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment