గర్భిణిని ఆసుపత్రికి తరలించిన సుభాష్
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు1
మండల కేంద్రమైన ముధోల్ కు చెందిన సోన్ కాంబ్లే హార్థిక రాజు కు శుక్రవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో వారి కుటుంబ సభ్యులు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ డ్రైవర్ అయిన గడ్డం సుభాష్ ను చరవాణి ద్వారా సంప్రదించగా వెంటనే ఆయన తన సొంత వాహనంలో భైంసా ఏరియా ఆసుపత్రికి గర్భిణీని తరలించడం జరిగింది. ప్రసవ సమయానికి ఆసుపత్రికి పంపించడంతో గర్భిణీ పండంటి పాపకు జన్మనిచ్చి ఆరోగ్యంతో ఉందన్నారు. ఎవరైనా ఏ సమయంలోనైనా నన్ను సంప్రదిస్తే నేను సహాయం చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. తన సేవా కార్యక్రమాలతో ప్రజలతోపాటు అధికారుల మననాలు పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త భాస్కరోళ్ల విజయ, గర్భిణీ కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు