11 స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి: కేసీఆర్!
తెలంగాణ : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని పార్టీ నేతలతో చెప్పినట్లు సమచాారం. జూబ్లీహిల్స్ సహా 11 స్థానాల్లో బై ఎలక్షన్స్‌కు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని SC చెప్పిన విషయం తెలిసిందే