ఆగస్టు 4 నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు
శ్రావణ మాసంలో శోభను సంతరించుకునే శ్రీవేంకటేశ్వరుడికి తిరుమలలో ఆగస్టు 4 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. శ్రీనివాసుడికి నిత్యం ఏదో ఒక ఉత్సవంతో శోభిస్తాడు. ఈ ఉత్సవాల్లో జరిగే అపచారాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండోరోజు సమర్పణ, మూడోరోజు పూర్ణాహుతి జరుగుతుంది