మూడు సంవత్సరాల తర్వాత మంజూరైన ఆసరా పింఛన్
ఎమ్మెల్యే రామారావు పటేల్ చొరవతో రాపత్ పోసవ్వకు న్యాయం
మనోరంజని ప్రతినిధి ముధోల్, జూలై 31 – నిర్మల్ జిల్లా ముధోల్ మండలం లోని కారేగాం గ్రామానికి చెందిన రాపత్ పోసవ్వకు మూడు సంవత్సరాల తరువాత ఆసరా పింఛన్ మంజూరైంది. భర్త మృతి చెందినప్పటినుంచి పింఛన్ కోసం అధికారులను, స్థానిక నాయకులను వేడుకున్నా పట్టించుకునే వారు లేకపోయారని ఆమె వేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను కాసారం శ్రీకాంత్, మాజీ ఉపసర్పంచులు నారాయణ్ రెడ్డి, గంగారెడ్డి ఈ. ఎం. టి ఏఐ సీఎం ఎమ్మెల్యే రామారావు పటేల్ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన వెంటనే స్పందించి పింఛన్ మంజూరుకు చర్యలు చేపట్టారు. గురువారం రోజున, పింఛన్‌ను స్థానిక నాయకులు పోసవ్వకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు, సంబంధిత నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
మూడు సంవత్సరాల తర్వాత మంజూరైన ఆసరా పింఛన్
Published On: July 31, 2025 9:22 pm
