సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ:-

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సాప పండరి:-

తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాప పండరి ఆధ్వర్యంలో నవీపేట మండల చైర్మన్ డి.రాకేష్ తన స్వంత ఖర్చులతో అభంగపట్నం ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ, రాకేష్ యొక్క సేవలను మాటల రూపంలో చెప్పలేమని,రాతలను రూపంలో రాయలేమని, ఎంత వర్ణించినా తక్కువేనని,అనేక సేవా కార్యక్రమాలలో ముందుంటున్న వ్యక్తి అని, కరోనా సమయంలో 50 రోజులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి, బాటసారులకు, అభాగ్యులకు అన్నదానం చేశారని, అదే విధంగా కష్టం వచ్చిన ప్రతి చోట, సామాన్యులకు అండగా నిలబడి తన ఔన్నత్యాన్ని చాటుకున్న గొప్ప మహానుభావుడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న పి.ఆర్. టి.యు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్. జె. డబ్ల్యూ. హెచ్. ఆర్. సి ఆర్గనైజేషన్ డాక్టర్ సాప పండరి దూర ప్రాంతం నుండి వచ్చి సేవలు అందించడం అభినందనీయమని, చేస్తున్న
రాకేష్ చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని అనునిత్యం గమనిస్తున్నామని,స్వార్థం,ఈర్ష్య, రాగద్వేషాలు లేని సజ్జనుడని అన్నారు.నవీపేట మండల విద్యాధికారి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు మా పాఠశాలను ఎంచుకొని, విచ్చేసిన ప్రతినిధులకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాసర మండల ప్రతినిధి దయాకర్, నవీపేట్ మండల డైరెక్టర్ గైని రాజేశ్వర్, మరియు పి.ఆర్.టి.యు మండల అధ్యక్షులు భూమన్న,జనరల్ సెక్రటరీ శివకుమార్ ఉపాధ్యాయ బృందం సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, మహిళా ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి శ్రీ వినోద పలువురు గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment