నాగార్జున సాగర్ డ్యామ్ నుండి
నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హాజరైన స్థానిక శాసనసభ్యులు కుందురు జయవీర్ రెడ్డి,బత్తుల లక్ష్మారెడ్డి,శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ తదితరులు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్
వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసింది
మొదటి పంచవర్ష ప్రణాళికలోనే తొలి ప్రధాని నవ భారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రు ఆధునిక దేవాలయాలకు అంకురార్పణ చుట్టారు
నెహ్రు వేసిన పునాది ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర ప్రధాయని గా మారింది
దేశం కోసం ప్రాణాలు బలిదానం చేసిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రాజెక్టు ఇది
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదట ఖరీఫ్,రబీ సీజన్ లతో పాటు ప్రస్తుత ఖరీఫ్ కు సమృద్ధిగా కృష్ణా జలాశయాలు
ఇది రైతుపక్షపాత ప్రభుత్వం
నిర్దిష్ట షెడ్యూల్ కు ముందే ఎడమకాలువ ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రైతాంగానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల నేతృత్వంలో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రికార్డు సృష్టించింది
సమిష్టి నిర్ణయాలతో పోయిన సంవత్సరం ఖరీఫ్,రబీ సీజన్ లు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించాం
ఇది యావత్ భారతదేశము లోనే అరుదైన రికార్డ్
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం 22.12 లక్షల ఎకరాలు
తొలి ప్రధాని నెహ్రూ గారితో పిలువ బడుతున్న కుడి కాలువ ఆయకట్టు 11.74 లక్షల ఎకరాలు
మలి ప్రధాని దివంగత లాల్ బహుదూర్ శాస్త్రి గారి పేరుతో పిలువబడుతున్న ఎడమ కాలువ విస్తీర్ణం 10.38 లక్షల ఎకరాలు
అందులో తెలంగాణా భూభాగంలో 6.30 లక్షల ఎకరాలకు ఆంద్రప్రదేశ్ భూభాగంలో 4.08 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు త్రాగు నీరు అందిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు
జిల్లాల వారిగా చూస్తే నల్లగొండ జిల్లాలో 1.46 లక్షల ఎకరాలకు, సూర్యపేట జిల్లాలో 2.30 లక్షల ఎకరాలకు ఖమ్మం జిల్లాకు 2.54 లక్షల ఎకరాలకు సాగునీరు
1955 డిసెంబర్ 10 న తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన
1967 నాటికి స్పిల్ వే పనుల పూర్తి
అదే సంవత్సరంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
1974 నాటికి క్రస్ట్ గేట్లు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటిని నిలువ చేయడం జరిగింది
2005 నాటికి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో స్వర్ణోత్సవ వేడుకలు
ఎడమ కాలువ పొడవు 180.75 కిలో మీటర్లు
21 వ బ్రాంచ్ కేనాల్ పొడవు 112.02 కిలో మీటర్లు
తెలంగాణా భూబాగంలో 15,642 కిలో మీటర్లు విస్తరించి ఉన్నది
అరుమార్లు శాసనసభ్యుడిగా ఒక మారు లోకసభ సభ్యుడిగా కృష్ణా పరివాహక ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్న
రైతాంగం సమస్యలు తెలిసిన వాడిగా రైతులకు సమృద్ధిగా సాగు నీరు అందిస్తాం
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా సాగునీరు అందిస్తాము
30 వేల క్యూసెక్కుల నీటి వినియోగంతో సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి 7 యూనిట్స్ లలో 700 మేఘవాట్ల విద్యుత్ ఉత్పత్తి
ఎడమ కాలువ నీటి వినియోగంతో 2 యూనిట్స్ లలో 60 మేఘవాట్ల విద్యుత్ ఉత్పత్తి