తగిలే పల్లిలో ప్రభుత్వ భూములు కబ్జా, అటవీ భూముల కబ్జాపై గ్రామస్తుల కన్నెర్ర
తగిలే పల్లి అటవీ ,రెవెన్యూ భూములలో ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా మొరం తవ్వకాలు
అటవీ ,రెవెన్యూ భూములలో మొరం తవ్వడమే కాకుండా భూములు కబ్జా
రోడ్డు పనుల అభివృద్ధి నిమిత్తం పగలు రాత్రి తేడా లేకుండా మొరం త్రవ్వకాలు
ఇంకెన్నాళ్లు మొరం తవ్వుతారు , ఇంకెన్నాళ్లు భూములు కబ్జా చేస్తారు అని కదం తొక్కిన తగిలేపల్లి గ్రామ ప్రజలు
సుమారు ఐదు నుంచి ఆపై ప్రభుత్వ ,అటవీ భూములు కబ్జా చేశారని గ్రామస్తులు జిల్లా స్థాయి అధికారులకు కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధం,
అక్రమంగా మొరం తవ్వకాలు చేస్తుంటే కబ్జాలు చేస్తుంటే రెవెన్యూ అధికారులు, తాసిల్దార్ ఏమి చేస్తున్నాడు అంటూ గ్రామస్తుల కన్నెర్ర
వర్ని తాసిల్దార్ తీరుపై గ్రామస్తుల మండిపాటు
వర్ని
తగిలేపల్లి
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామ అటవీ, రెవిన్యూ భూములలో ప్రభుత్వ భూములలో కొంతమంది అక్రమ దారులు మొరాన్ని అక్రమంగా తరలిస్తూ కొన్ని ఏళ్ళ నుంచి గుట్టలు మాయం చేయడమే కాకుండా, గుట్టలో ఉన్న పెద్ద పెద్ద మహావృక్షాలను ధ్వంసం చేస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు, అభివృద్ధి పనుల పేరుతో పగలు రాత్రి అని తేడా లేకుండా ఇష్టానుసారంగా మొరం త్రవ్వకాలు చేస్తూ వాటిని విక్రయాలు చేసుకుంటూ వల్తా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని కొండలు మాయం చేస్తున్నారని ఇలాగే అయితే భూసారం నిస్సారవంతంగా మారి భావితరాల వారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. రోడ్డు పనులకు అనుమతులు ఉన్నాయంటూ పగలు రాత్రి అనే తేడా లేకుండా మొరం త్రవ్వకాలు గతంలో చేయడం జరిగిందని ప్రస్తుతం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వీటిపై సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి దృష్టి పెట్టడం లేదని మామూళ్ల మత్తులో మనుగు తున్నారని ప్రజలు అనుమానాలతో పాటు విమర్శలు చేస్తున్నారు. తగిలేపల్లి అటవీ ప్రాంతం తో పాటు రెవెన్యూ భూములు మొరం త్రవ్వకదారులు మొరం మాఫియాదారులు ఒక అడ్డగా ఏర్పరచుకొని ఏండ్ల నుంచి ప్రతి రోజు పగలు రాత్రి అనే తేడా లేకుండా భారీగా అత్యంత లోతుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా మొరం త్రవ్వకాలు చేస్తూ వాటిని పట్టణాలు పల్లెల్లో భారీరేట్లకు అమ్ముకుంటున్నారని వీటిపై దృష్టి పెట్టవలసిన పంచాయతీ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు మైనింగ్ శాఖ అధికారులు అదేవిధంగా అధికా ల్లోడుతో అత్యంత వేగంతో రోడ్లు ధ్వంసం వహించే విధంగా ప్రజలకు కంటికి కునుకు లేకుండా భీకరమైన శబ్దంతో కునుకు లేకుండా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన వివిధ శాఖలు చెందిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా మామూళ్ల మత్తులో ములుగుతున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. గ్రామంలోని ఓ వ్యక్తి మొరం మాఫీదాలతో చేతులు కలిపి దగ్గరుండి త్రవ్వకాలు చేయిస్తున్నారని ఈ భూములను కబ్జా చేసే యత్నం చేస్తున్నారని అక్రమంగా పట్టాలు చేసుకునే యత్నం చేస్తున్నారని ఇప్పటికే అనేక భూములు కబ్జా కోరలకు గురి అయినయని వీటిపై దృష్టి పెట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అనేక ఏండ్ల నుంచి విచ్చలవిడిగా కొనసాగుతున్న మొరం మాఫియాను అధికారులు ఆపాలని ప్రజలు కోరుతున్నారు