అక్రమంగా తవ్వుతున్న మొరం త్రవ్వకలను ఆపండి
వర్ని
తగిలేపల్లి
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలే పల్లి గ్రామ ప్రభుత్వ భూములలో అక్రమంగా తవ్వుతున్న మొరం త్రవ్వకాలను ఆపండి అంటూ గ్రామస్తులు వర్ని తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అనేక ఏళ్ల నుంచి మొరం త్రవ్వకాలు భారీగా జరుగుతున్నాయని పగలు ,రాత్రి అనే తేడా లేకుండా మొరం త్రవ్వకాలు జరగడం వల్ల గుట్టలు మాయమైపోతున్నాయని పచ్చని చెట్లు కూడా ధ్వంసం అవుతున్నాయని అన్నారు. కొండలు, గుట్టలు మాయమైపోతే గ్రామ ప్రజలకు భావితరాల వరకు భవిష్యత్తులో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కాపాడాలని వారు కోరడం జరిగింది. గ్రామంలో మొరం అవసరమైతే మాకు మొరం లభ్యం కానీ పరిస్థితులు నెలకొంటున్నాయి అని ఇప్పటికే వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని మా గ్రామ వనరులు కాపాడాలని గ్రామస్తులు వారితో కోరడం జరిగింది. మొరం త్రవ్వకలతో పాటు ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జా చేసుకుంటున్నారని సుమారు ఐదు ఎకరాలకు పైగా కబ్జాకు గురయ్యాయని ఈ భూములన్నీ సర్వే చేసి తిరిగి ఆక్రమించుకొని గ్రామానికి అభివృద్ధి చేసే విధంగా లబ్ధి చేసే విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా చూడాలని తాసిల్దార్ ను గ్రామస్తులు కోరడం జరిగింది. ఈ వినతిపత్రం అందజేత కార్యక్రమంలో తగిలేపల్లి గ్రామ ప్రజలు ఉన్నారు