జడ్చర్ల: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
Jul 29, 2025,
జడ్చర్ల: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
జడ్చర్ల నియోజకవర్గం నవాబ్‌పేట మండలం కాకర్లపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, ఇంటింటి సర్వే వేగవంతం చేయాలని ఆదేశాలు. యూరియా సరఫరాపై అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో బిల్లులు సకాలంలో అకౌంట్లో పడ్డాయా అని ఆరా తీశారు. అనంతరం కేజీవీబీ పాఠశాలను సందర్శించారు. ప్రజా పరిషత్ కార్యాలయంలో మొక్కలను నాటారు