తెలంగాణ : ఆర్టీసీ టికెట్ ధరలపై భారీ తగ్గింపు….
తెలంగాణ : హైదరాబాద్- విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. గరుడలో 30శాతం, ఈ-గరుడలో 26శాతం, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీలో 20శాతం, రాజధాని, లహరి ఏసీలో 16శాతం తగ్గిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది