బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం ఇవ్వాలి

ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం

హైదరాబాద్, జూన్ 29 (M4News):

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ రెండు బిల్లులను మార్చి 22న రాష్ట్ర గవర్నర్‌కు పంపించగా, ఆయన రాష్ట్రపతి వద్దకు పంపినట్లు మంత్రి వెల్లడించారు.

సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో 5 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గడువు విధించడంతో, బీసీ రిజర్వేషన్ అంశం తక్షణమే పరిష్కారం కావాల్సిన అవసరం ఉందన్నారు.

“కొంతమంది కడుపులో కత్తులు పెట్టుకున్నట్లు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అడ్డు తగులుతున్నారు. బీజేపీ నేతలు దీన్ని అడ్డుకోవడం దురదృష్టకరం,”

అంటూ ఆయన విమర్శించారు.

తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని ఒప్పించి బీసీలకు న్యాయం జరగేలా చేయాలని పిలుపునిచ్చారు. బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలన్న దిశగా ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం త్వరలో బయలుదేరనున్నట్లు మంత్రి వెల్లడించారు.

కేబినెట్ సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించామని, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తగిన హక్కులు కల్పించే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment