తెలంగాణలో ప్రభుత్వ పథకాలకు ఇంటి వద్దే దరఖాస్తులు!
తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు పొందినవారికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్తగా రేషన్ కార్డులు పొందినవారికి కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు అందించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్‌ను ఏర్పాటు చేసిందని సమాచారం. ఇందులో భాగంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500, గృహాజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత వంటి పథకాలకు దరఖాస్తులను అధికారులు నేరుగా ఇంటి వద్దకే వచ్చి స్వీకరించనున్నారు