గృహలక్ష్మి లబ్ధిదారులకు మొండి చెయ్యి…?

గృహలక్ష్మి లబ్ధిదారులకు మొండి చెయ్యి…?

ఇంద్రమ్మ పథకంలో అవకాశం కల్పించండి

ప్రజా ప్రతినిధులు-అధికారులను కోరుతున్న లబ్ధిదారులు

*ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 27*
గృహలక్ష్మి లబ్ధిదారులకు మొండి చెయ్యి...?

ఇల్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా సొంత ఇంటి కలను సహకారం చేయడానికి ప్రోసిడింగ్ కాపీలను అందించింది. ముధోల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో దాదాపు 3000 మంది లబ్ధిదారులకు 2023 సెప్టెంబర్ నెలలో ప్రొసీడింగ్ కాపీలను అందించింది. లబ్ధిదారులు తమ సొంతింటి కలను సహకారం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 3 లక్షల రూపాయలను లబ్ధిదారులకు చెల్లిస్తారని పేర్కొన్నారు. లబ్ధిదారులు సైతం ఇంటి పనులను ప్రారంభించారు. లబ్ధిదారులకు బేస్మెంట్- స్లాబ్ వేసిన తర్వాత ఇల్లు మొత్తం పూర్తి అయితే మూడు విడతల్లో డబ్బులు చెల్లిస్తామన్నారు. అయితే అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గృహలక్ష్మి పథకానికి బదులుగా ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులకు 5 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుందని పేర్కొంది. ప్రజా పాలనలో భాగంగా లబ్ధిదారుల నుండి ప్రభుత్వం వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ఇంద్రమ్మ కోసం సైతం దరఖాస్తులు స్వీకరించారు. అయితే అప్పటికే గృహలక్ష్మి పథకం ద్వారా ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలను ప్రారంభించి వివిధ దశలకు చేరుకుంది. 2025 మార్చి నెలలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో గృహలక్ష్మి లబ్ధిదారుల వివరాలను సేకరించి పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది. మండల అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది గృహలక్ష్మి లబ్ధిదారులకు సంబంధించి గృహాల వివరాలను వారి స్టేజీల ఆధారంగా నమోదు చేసుకుని మండల అధికారులకు అందించారు. మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల వివరాలను జిల్లా అధికారులకు పంపారు. అయితే ఇంద్రమ్మ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో గృహలక్ష్మి లబ్ధిదారులు సైతం ఉన్నారు. ప్రభుత్వం సొంత స్థలం కలిగి ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసింది. తమకు గతంలోనే ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లను మంజూరు చేసిందని అనంతరం అప్పులు చేసి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని లబ్ధిదారులు పేర్కొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment