ఎన్ హెచ్ ఆర్ సి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ఎన్ హెచ్ ఆర్ సి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

*నిజామాబాద్ మనోరంజని ప్రతినిధి జూలై 27*

నిజామాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర సారథ్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ట్రాఫిక్ ఏసీపి మస్తాన్ అలీ మాట్లాడుతూ.. వ్యాపారస్తులకు అవగాహన కలిగించే విధంగా సమావేశం జరగడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. వ్యాపారస్తులు కూడా అక్రమ కట్టడాలకు విషయంలో జాగ్రత్తలు వహించాలని.. అక్రమ కట్టడాల విషయంలో ఫుట్ పాత్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ అండర్ 39(బి) ప్రయోగం జరుగుతుందని తద్వారా రాబోయే రోజుల్లో షాపు లైసెన్సు సైతం రద్దు చేయబడుతుందని వ్యాపారస్తులు పోలీసులకు సహకరించి నగర సుందరీ కరణలో భాగంగా రాబోయే రోజుల్లో విద్యార్థులు గర్భిణీలు వయోవృద్ధులు పాదచారులు నడవడానికి వీలుగా తమ పరిధిలోనే వ్యాపారాలు కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు పోలీసు ఉన్నతాధికారులకు ఎన్ హెచ్ ఆర్ సి టీం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్క వ్యాపారస్తులం సహకరిస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ట్రాఫిక్ సిబ్బంది, ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఎన్ హెచ్ ఆర్ సి అధికార ప్రతినిధి సముద్రాల మాధురి, గౌరవ అధ్యక్షులు మాజీ డి ఐ ఈ ఓ రఘురాజ్, ఆజం రోడ్డు వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment