మాదకద్రవ్యాలను నిర్మూలిద్దాం-ఆత్మహత్యలను అరికడుదాం
వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలు-విద్యార్థులకు బహుమతులు
ప్రతినిధులకు శాలువాలతో ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయ బృందం
కుబీర్ మండలంలోని పార్డి-బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాప పండరి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో మాట్లాడుతూ సిగరెట్, గంజాయి, గుట్కా, ఆల్కహాల్ వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, “””యువత మత్తు పదార్థంతో జీవితం- చిత్తు చేసుకోవద్దని”””, ఈ వ్యసనాలతో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, పాడైపోయి పలు అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని, కాదని మనకు ఏదైనా ప్రమాదం జరిగితే, తల్లిదండ్రులు తట్టుకోలేరని, “””సమాజంలో కూడా వ్యసనాలపై మార్పు రావాలనే ఉద్దేశంతో,విద్యార్థులతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.”””” “””మత్తుకు యువత జీవితం-చిత్తు కావద్దు”””అనే అంశంపై వ్యాసరచన , చిత్రలేఖనం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఆర్గనైజేషన్ తరపున అందజేశారు. నిర్మల్ జిల్లా వైస్ చైర్మన్ సామాజిక సేవకులు లక్ష్మణరావు పటేల్ విద్యార్థులను ఉద్దేశించి కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, “””తల్లిదండ్రుల మీద దయలేని పుట్టనేమి వాడు గిట్టనేమి””అంటూ చక్కని పద్యాలతో విద్యార్థులకు హితవు పలికారు. కుబీర్ మండల వైస్ చైర్మన్ గాంధారి సాయినాథ్ విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి స్నేహితులతో కలిసి ఉండాలని, పదవ తరగతిలో ఉత్తమ ఫలితం సాధించిన విద్యార్థికి 1116 రూపాయలు బహుమతిగా ఇస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెడ్మాస్టర్ రవీందర్, ఉపాధ్యాయ బృందం శ్రీనివాస్, రాజేశ్వర్, పోశెట్టి, శ్రీమతి కవిత పలువురు గ్రామస్తులు SJWHRC ప్రతినిధులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.