సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
-ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ జులై 25 -=నిర్మల్ జిల్లా,సారంగాపూర్:ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు అన్నారు. శుక్రవారం
మండల కేంద్రంలో ప్రజలుకు
సీజనల్ వ్యాధులపై అధికారులు ప్రాథమిక అరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బందితో కలసి సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రబలే వ్యాధుల నుంచి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఇంటి అవరణలోని తొట్టెల్లో టైర్లలో, కూలర్లలో నీటి నిల్వలు లేకుండా ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డేను పాటించి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధి కారి అబ్ధుల్ జావేద్, ఎంపిఓ అజీజ్ ఖాన్,ఏపీఎం మధుకర్,ఏపీఓ లక్ష్మారెడ్డి,
హెల్త్ సుప్రవేసర్ కృష్ణ మోహన్ గౌడ్,కళాశాల అధ్యాపకులు,పంచాయతీ కార్యదర్శులు,అంగన్ వాడి టీచర్లు,ఆశలు,పాల్గొన్నారు