కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ’తెలంగాణ ’ రామారావు
–కోట్లాదిమంది గుండెల్లో కొలువైన యువనేత
–అధికారమదంతో కేటీఆర్ ప్లెక్సీలు తొలగించగలరేమో కానీ..
–జనం గుండెల్లో గూడుకట్టు కున్న ఆయన పేరును చెరిపేయలేరు
–కేటీఆర్ ఐటీకి ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్
_హైదరాబాద్ నగరానికి విశ్వఖ్యాతి తెచ్చిన దీక్షాదక్షుడు
–కేసీఆర్, కేటీఆర్ లవి చెరిపేస్తే పోయే ఆనవాళ్లు కాదు
–కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే తెలంగాణ ను మళ్లీ ఆంధ్రాలో కలపడమే
– ఐటీ ఉన్నంత వరకూ కేటీఆర్ పేరు చరిత్రలో నిలిచి ఉంటుంది
–కేటీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్ నేతల లాగులు తడుస్తున్నాయి
–అక్కసుతోనే ఆయనను కాంగ్రెస్ టార్గెట్ చేసింది
–ఏ తప్పు చేయక పోయినా అక్రమ కేసులతో వేధింపులు
–చివరకు కేటీఆర్ బర్త్ డే వేడుకలపైనా విషం కక్కిన సీఎం రేవంత్
–కాంగ్రెస్ అరాచక పాలన అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు
–బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్, జూలై 25:–
కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ’తెలంగాణ ’రామారావు అని, తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా స్వరాష్ట్ర సాధన ఉద్యమ చరిత్ర నుంచి, ప్రజల మదిలో పదిలపర్చుకున్న పదేళ్ల సుపరిపాలనా ప్రస్థానం నుంచి కేటీఆర్ ఆనవాళ్లను చెరిపేయలేరని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కోట్లాది మంది గుండెల్లో కొలువైన యువనేత కేటీఆర్ అని ఆయన పేర్కొన్నారు. అధికారమదంతో ప్రభుత్వ పెద్దలు హైడ్రాను అడ్డం పెట్టుకొని కేటీఆర్ ప్లెక్సీలు తొలగించ గలరేమో కానీ…
జనం గుండెల్లో గూడుకట్టు కున్న ఆయన పేరును చెరిపేయలేరని స్పష్టం చేశారు.
కేటీఆర్ ఐటీకి ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ అని
ఎస్‌ఎన్‌డీపీ, ఫ్లైఓవర్స్, నాలెడ్జ్ సిటీ ఇలా ఎన్నో కేటీఆర్ సృష్టించారని ఆయన తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం తనలో సహజసిద్ధంగా ఉన్న అధ్యయనం, కార్యశీలత, కమిట్‌మెంట్, విషయ నైపుణ్యం వంటివి పుణికి పుచ్చుకున్న కేటీఆర్ కు దేశ, విదేశాల్లో గౌరవమర్యాదలు దక్కుతున్నాయన్నారు. కేటీఆర్ సుదీర్ఘకాలం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో దేశ, విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందాయని, తన పనితీరుతో జాతీయ, అంతర్జాతీయ ఇమేజ్‌ను తెచ్చారనటంలో అతిశయోక్తి లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణలో ప్రైవేట్ రంగంలో 16 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరిగిందనీ, పెట్టుబడులూ అదే దామాషాలో రాష్ర్టానికి వచ్చాయని ,దేశ, విదేశాల్లో ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాలకు కేటీఆర్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని ఆయన గుర్తు చేశారు. అందువల్లే అధికారం లేకపోయినా కేటీఆర్‌కు దేశ, విదేశాల్లో అదే క్రేజ్..అదే ఇమేజ్ ఇప్పటికే కొనసాగు తున్నాయన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని ఐటీ, ఇండస్ట్రీయల్ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్‌దని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో, హైదరాబాద్ అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలను స్థాపించడంలో కేటీఆర్ చేసిన కృషి, టీ-హబ్, వీ-హబ్, టీ-వర్స్ వంటి వినూత్న కార్యక్రమ స్టార్టప్‌ల సృష్టిలో అనుసరించిన వైఖరిని పలు సందర్భాల్లో కొనియాడిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కేటీఆర్‌ను ఐకానిక్‌గా అభివర్ణించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్,
హైదరాబాద్ నగరానికి విశ్వఖ్యాతి తెచ్చిన దీక్షాదక్షుడు కేటీఆర్ లవి చెరిపేస్తే పోయే ఆనవాళ్లు కాదన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే తెలంగాణ ను మళ్లీ ఆంధ్రాలో కలపడమేనని, ఆయన కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూమ్, ఆయన నెలకొల్పిన 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టడమేనని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీ ఉన్నంత వరకూ కేటీఆర్ పేరు చరిత్రలో నిల్చివుంటుందని, ఆయన గుర్తులు చెరిపేయడమంటే హైదరాబాద్ నుంచి ఐటీ పరిశ్రమలను తరిమేయడమేనని ఆయన చెప్పారు. కేటీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్ నేతల లాగులుతడుస్తున్నాయని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఆయనపై అక్కసు తోనే కాంగ్రెస్ టార్గెట్ చేసిందని,
ఏ తప్పు చేయక పోయినా అక్రమ కేసులతో వేధిస్తోందని
ఆయన మండిపడ్డారు.
చివరకు కేటీఆర్ బర్త్ డే వేడుకలపైనా విషం కక్కిన సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగించే చిల్లర పనికి ఒడిగట్టారని ఆయన ధ్వజమెత్తారు. హైడ్రాను ఆదేశించి నగరంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపి వేయించారని ఆయన చెప్పారు. కానీ వాటి పక్కనే ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పోస్టర్లను మాత్రం వదిలేశారనీ, బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ, ఇతర కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను అసలు ముట్టు కోలేదని ఆయన పేర్కొంటూ, కేటీ ఆర్ ఫ్లెక్సీలపై హైడ్రా అధికారుల తీరును ఖండించారు. కేటీఆర్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఎక్కడ కనబడ్డా వెంటనే తీసేయాలని తెలంగాణ సీఎంవో నుంచి డైరెక్ట్ గా ఆదేశాలు వచ్చాయని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులే చెబుతున్నారని ఆయన చెప్పారు. కేటీఆర్ ఫ్లెక్సీలను చించొచ్చేమో కానీ కేటీఆర్‌పై ఉన్న అభిమానాన్ని పోగొట్టలేరని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అరాచక పాలన అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని జీవన్ రెడ్డి హెచ్చరించారు