భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,050 పెరిగి రూ.92,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,140 పెరిగి రూ.1,01,290 పలుకుతోంది. వెండి ధర ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై రూ.2,000 పెరగడంతో రూ.1,28,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి
భారీగా పెరిగిన బంగారం ధరలు
Published On: July 22, 2025 10:19 pm