అశోక్ నగర్‌లో మాల సంఘం ఆధ్వర్యంలో బోనాల మహోత్సవం వైభవంగా
మనోరంజని ప్రతినిధి – నిజామాబాద్ బోధన్ రోడ్డులోని అశోక్ నగర్ బస్తీలో మాల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్థానిక మహిళలు సంప్రదాయ బద్దంగా అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సకాలంలో కురవాలని, అమ్మవారి చల్లని కృప సమస్త ప్రజలపైనా ఉండాలని ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా బస్తీ మహిళలు శోభాయాత్రగా బోనాలు ఎత్తి పాల్గొన్నారు. తాండూరుతో, నృత్యాలతో బోనాల ఉత్సవం మరింత రంబోగా మారింది. మహిళల ఉత్సాహం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
కార్యక్రమానికి ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితులుగా గైని గంగారం , సఖి మోటార్ గంగాధర్ , మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సఖి విజయ్ కుమార్ , నగర అధ్యక్షులు సఖి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి చిన్న గంగాధర్ , సుబ్బయ్య గారు, బాబన్న, చిన్న రాజు , పోశెట్టి , నర్సింగ్ , సఖి ఆనంద్, సురేష్, సంజయ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.మహిళా విభాగం నుంచి జిల్లా అధ్యక్షురాలు సుంకరి విజయ, భూలక్ష్మి, లావణ్య, మంజులలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని అలంకరించారు. బస్తీ వాసుల సహకారంతో ఈ వేడుక వైభవంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు
అశోక్ నగర్‌లో మాల సంఘం ఆధ్వర్యంలో బోనాల మహోత్సవం వైభవంగా
Published On: July 22, 2025 6:13 pm