వారం రోజుల పాటు భారీ వర్ష సూచన – అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ

వారం రోజుల పాటు భారీ వర్ష సూచన - అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ

వారం రోజుల పాటు భారీ వర్ష సూచన – అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ

 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం – ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం

వేడి, ఉక్కపోతతో గత కొద్ది రోజులుగా అవస్థలు పడుతున్న ఏపీ ప్రజలకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో ఈదురు గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ సూచించారు.

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని పేర్కొన్నారు.

నాగార్జునసాగర్‌కు 67,000 క్యూసెక్కుల విడుదల: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 67 వేల 986 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. పరీవాహక ప్రాంతాల్లోని జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 57 వేల 845 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 881.20 అడుగులు, నీటినిల్వ 194.75 టీఎంసీలుగా ఉంది

Join WhatsApp

Join Now

Leave a Comment